హవేలీ ఘన్పూర్: బాలల సంరక్షణ చట్టాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వెల్లడి
జిల్లాలో బాలల సంరక్షణ చట్టాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ప్రచార వాహనాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ శనివారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ప్లాన్ ఇండియా , జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు బాలల సంరక్షణ విభాగం సంయుక్తంగా బాలల సంరక్షణ మరియు చట్టపరమైన అవగాహన కార్యక్రమం లో భాగంగా, మొబైల్ వాన్ ఆదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా మెదక్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆరు రోజులపాటు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిర్వహిస్తున్నామని తెలిపారు.