డోన్ మండలంలో చిరుతపులులలో కలకలం
Dhone, Nandyal | Dec 3, 2025 నంద్యాల జిల్లా డోన్ మండలం చనుగొండ్ల గ్రామ శివారులో చిరుత పులుల సంచారంతో గ్రామస్థులు భయానికి గురయ్యారు. మంగళవారం గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన దున్నపై రెండు చిరుత పులులు దాడి చేసి చంపిన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. దీంతో గొర్రెల కాపర్లు, రైతులు పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. మహిళలు, పిల్లలు రాత్రివేళ బయటకు రావడానికి కూడా జంకుతున్నారు.