ఒంగోలు పట్టణంలో పీఎం ఆవాస్ యోజ కార్యక్రమంలో భాగంగా నూతన గృహాలను ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Mar 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పీఎం ఆవాస్ యోజన పథకం కార్యక్రమం లో భాగంగా నూతనంగా నిర్మించిన గృహాలను కలెక్టర్ రాజాబాబు మరియు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 లక్షల పైగా ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని కలెక్టర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు నూతన పక్కా గృహం కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు లక్షల 50 వేల రూపాయలు గృహ నిర్మాణానికి ఇవ్వడం జరుగుతుందని అలానే ఎస్సీ ఎస్టీలకు అదనంగా లక్ష కేటాయిస్తామన్నారు.