పెద్దపల్లి: భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 28 వరకు పెద్దపల్లి జిల్లాల్లో మండల స్థాయిలో భూ భారతి చట్టం పై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ అవగాహన కార్యక్రమాలకు రెవెన్యూ డివిజన్ అధికారులు, అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) , జిల్లా కలెక్టర్ హాజరై ప్రజలకు చట్టంలోని అంశాలను వివరిస్తారని కలెక్టర్ తెలిపారు.