సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి: నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయ
Nandyal Urban, Nandyal | Dec 3, 2025
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం పేర్కొన్నారు. బుధవారం నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మహిళా నర్సులకు శక్తి యాప్ గురించి వివరించారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించే వద్ద తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.