విద్యార్థులు క్రీడలు, చదువులో శ్రద్ధ వహించాలి మాదకద్రవాలకు దూరంగా ఉండాలి.తిమ్మాపురంలో సైకియాట్రిస్ట్ సిందుజ
మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమని సైకియాట్రిస్ట్ డాక్టర్ సింధుజ ఓంకారం తెలిపారు. మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం, పొగాకు రహిత జీవనం, మానసిక ఆరోగ్యం అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధుజ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను ధైర్యంగా ఎదుర్కొనే మనోబలం పెంపొందించుకోవాలని సూచించారు.మత్తు పదార్థాలు, పొగాకు వాడకం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందని, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు వ