హయత్‌నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో బ్యాంకు ఆవరణ నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు, పొగలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణలో బ్యాంకులోని AC యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.