విశాఖపట్నం: జులై 10వ తేదీ PTM పై జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షా మరియు మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్
విశాఖ జులై 10 వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర్ ప్రసాద్ జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షా మరియు మండల విద్యాశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. Mega PTM ఏర్పాట్లు గురించి, అతిధుల ఆహ్వానం, సాక్షి నమోదు, మొక్కలు పాఠశాలలకు చేరయా లేదా? అనే విషయాలను అడిగి తెలుసు కొన్నారు. ప్రోటోకాల్ ప్రకారము అన్ని కార్యక్రమాలు అమలు చేయవలసిందిగా తెలియజేశారు. టాయిలెట్స్ శుభ్రంగా ఉండేటట్లు మరియు మధ్యాహ్న భోజనం అందరికీ అందేటట్లు ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేశారు.