ఇబ్రహీంపట్నం: శేర్లింగంపల్లి డివిజన్లో సమస్యలు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ
శేర్లింగంపల్లి డివిజన్లోని వెంకటేశ్వర నగర్ శిల్ప గార్డెన్ కాలనీలలో పలు సమస్యలు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు డ్రైనేజీ సమస్య ఉందని తెలుపగా వెంటనే ఎమ్మెల్యే డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎటువంటి సమస్యలున్న పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.