రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో సమస్యలు పరిష్కరించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సూపరింటెండెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రోగులను అనంతపురం తరలించేందుకు 108 వాహనం రావడం లేదని దీనివల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 30 కిలో మీటర్ల పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.