ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు మద్యం ,నగదు తరలింపులపై అధికారులు దృష్టి సారించాలి : ఆర్డిఓ వెంకన్న
పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు మద్యం, నగదు తరలింపు పై అధికారులు దృష్టి సారించాలని స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో వెంకన్న అధికారులను సూచించారు. ఆర్డీవో కార్యాలయంలో పోలీసు రెవెన్యూ ఎక్సైజ్ శాఖల అధికారులతో ఎన్నికల పర్యవేక్షణ టీం లతో ఆర్డిఓ వెంకన్న మాట్లాడుతూ మద్యం నియంత్రణపై దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లో మద్యాన్ని రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం ఉన్నట్లు తెలిపారు. అక్రమ రవాణా జరగకుండా అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలి అన్నారు.ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులు వారి ప్రచార వీడియోలను తీస్తూ ఖర్చులను లెక్కించాలన్నారు .