కర్నూలు: ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌లో రైతులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్
ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ పేరుతో రైతుల నుంచి సేకరించిన భూములను పరిశ్రమల పేరుతో ఇస్తూ... స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోవడం గమనార్హమని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ అన్నారు. ఓర్వకల్ మండల డివైఎఫ్ఐ సమావేశం ఆదివారం కర్నూలులో నిర్వహించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ... ‘‘పరిశ్రమల పేరుతో దాదాపు 30 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. కానీ అక్కడ చిన్న పరిశ్రమలు స్థాపితమైనా... స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేద’’ అన్నారు. కనీసం 85 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్నది తమ డిమాండ్ అని పేర్కొన్నారు.ఉద్యోగాల పేరిట భూములు తీసుకున్న సంస్థలు వాటిన