నంద్యాలలో పగిలిన పైప్ లైన్ నుంచి నీటిని పట్టుకుంటున్న ప్రజలు
Nandyal Urban, Nandyal | Dec 24, 2025
నంద్యాలలోని లలితా నగర్లో మంచి నీటి పైపులైన్ పగిలిపోయి నీరు వృథాగా పోతోంది. పైపు లైన్ పగిలిపోయిందని సచివాలయం, ఫిట్టర్, వాటర్ వర్క్స్ అధికారులకు చెప్పినా ఫలితం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచి నీళ్ల కోసం ఇబ్బందులు పడుతూ కొందరు పగిలిన పైపులైన్ నుంచి వస్తున్న నీటిని తీసుకుంటున్నారు.