దేవరకద్ర: చిన్న చింతకుంట లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర...
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చిన్నచింతకుంట మండల కేంద్రంలో మంగళవారం రాత్రి 10:30 గంటలకు హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు గ్రామస్తులు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కాషాయ జెండాలతో డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ బానా సంచా కాలుస్తూ, జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.అనంతరం గ్రామ పురవీధుల గుండా శోభాయాత్రను కొనసాగించారు.ఈ కార్యక్రమంలో బిజెపి, బజరంగ్దళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.