భారత దేశంలో 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన ముగిసిన సందర్భంగా చెన్నూరు పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్ గారి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 3గంటలకి ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు పాల్గొని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల కరపత్రాలను ఇంటింటికి అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వం ఆర్థిక విధానాల కారణంగా ప్రపంచంలో భారత్ నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు.