సిర్గాపూర్: వాసర్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు పట్ల ఎమ్మెల్యే సంజీవరెడ్డి హర్షం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం వాసర్ గ్రామ శివారులో 25 ఎకరాలలో 2500 మంది విద్యార్థులు చదువుకునేందుకు నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు పట్ల ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన వాసర్ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణానికి వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.