కుప్పం: భూపతి పార్థివ దేహానికి ఎమ్మెల్సీ నివాళులు
రామకుప్పం మండలంలోని వీర్నమల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వన్నికుల క్షత్రియ డైరెక్టర్ భూపతి పార్థివ దేహానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నివాళులర్పించారు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. భూపతి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఆయన పార్టీకు చేసిన సేవలు మరువలేమని తెలిపారు.