ఖమ్మం అర్బన్: అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో మోసం చేసిన పశుసంవర్ధక శాఖ డీడీపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు
ఖమ్మం ఆర్బన్ మండలం వెలుగుమట్ల ప్రాంతంలో నాలుగు ఎకరాల భూమిలో హ్యాపీ హొమ్ అపార్టుమెంట్ పేరుతో అభివృద్ధి చేసి 24 నెలలలో నిర్మించి ఇస్తామని అగ్రిమెంట్ చేసి బాధితులను నమ్మించి ప్లాట్లకు డబ్బులు తీసుకొని మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకట నారయణపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.2021 లో సర్వెనెంబర్ 546 వెలుగుమట్ల ప్రాంతంలో హ్యాపీ హొమ్ అపార్టుమెంట్ అభివృద్ధి పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేశారని ఖమ్మం రూరల్ మండలం ఏదులపురానికి చెందిన వెంకటాచారి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.