ఉయ్యాలవాడ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు ప్రారంభించిన, ఎంఈఓ వీర ప్రతాపరెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఉయ్యాలవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఎంఈఓ వీర ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు ఈ పోటీలలో ఉపాధ్యాయులకు క్రికెట్, ఉపాధ్యాయురాళ్ళకు త్రో బాల్ పోటీలు నిర్వహించారు, విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహించడం హర్షనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఈ పోటీలలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పోటీల్లో పాల్గొన్నారు