కర్నూలు ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించడంతో ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని కర్నూలు 12వ వార్డు కార్పొరేటర్ క్రాంతి కుమార్ బహిరంగంగా ఆరోపించారు. దీనిపై శనివారం ఉదయం 11 గంటలు వివాదం రేగింది. వాహనదారులు చలానాలు ఆన్లైన్లో కడతామన్నప్పటికీ వాహనాలు ఇక్కడే పెట్టి వెళ్లాలని పోలీసులు చెప్పారు. విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని కొందరు వాహనదారులు అనడంతో మంత్రి చెప్పినందుకే ఈ చలానాలు అని పోలీసులు దబాయించారు.