దుబ్బాక: మిరుదొడ్డి లో ఏగుల్ల యాదగిరి గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం, చికిత్స పొందుతూ మృతి
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నించగా వారం రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఏగుల్ల యాదగిరి (40) అనే వ్యక్తి వారం రోజుల క్రితం ఇంట్లో గొడవపడి మధ్యం సేవించి ఆ తర్వాత గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుని భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిరుదొడ్డి ఎస్ఐ పరశురాములు తెలిపారు.