రాజేంద్రనగర్: చేవెళ్ల ప్రాంతంలోని మీర్జాగూడ శివారులో జింక ప్రత్యక్షం, పోలీసులకు సమాచారం అందించిన రైతు
రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం మీర్జాగూడ గ్రామ శివారులో ఓ జింక ప్రత్యక్షమైంది. ఆవుల జంగయ్య పొలం పని చేస్తుండగా వన్య ప్రాణి అక్కడికి వచ్చింది. అప్రమత్తమైన రైతు పోలీసులకు సమాచారాన్ని అందించాడు. అటవీ ప్రాంతం నుండి తప్పిపోయి చేవెళ్లవైపు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. అప్పటికే వీధి కుక్కలు జింకను వెంబడించి గాయాలు చేశాయని తెలిపారు. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు రైతులు తెలిపారు