రాయదుర్గం: టి. వీరాపురం గ్రామంలో భర్త చేతిలో హత్యకు గురైన బార్య
రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామంలో భర్త సుంకన్న బండరాయితో తలపై మోదిన ఘటనలో బార్య శివగంగమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు. శని అర్ధరాత్రి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సిఐ జయనాయక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.