అదిలాబాద్ అర్బన్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బేల లోని మహాకాళి ఆలయంలో నిర్వహించిన మహా హారతి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్
వేల సంవత్సరాల పురాతనమైన సనాతన హైందవ ధర్మం గొప్పదనాన్ని తెలుసుకునేలా ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శరన్నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజులపాటు అమ్మవారికి చేసే ప్రత్యేక పూజలల్లో మనతోపాటు అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బేల లోని మహాకాళి ఆలయంలో సోమవారం నిర్వహించిన మహా హారతి పూజ కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కలిసి అమ్మవారికి ఎమ్మెల్యే మహా హారతిని ఇచ్చారు. ఈ మహాకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ఇటీవలే రూ.20 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు