నంద్యాల బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
Nandyal Urban, Nandyal | Dec 23, 2025
నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. న్యాయమూర్తులు అమ్మన్న రాజా, తంగమని, శ్రీనివాస శర్మ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలైన న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి బహుమతులు పంపిణీ చేశారు. న్యాయమూర్తుల సమక్షంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అసోసియేషన్ అధ్యక్షులు ఉషన్ బాషా తెలిపారు.