అనంతపురం జిల్లా మూలగిరిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడి మహిళా కార్మికురాలు మృతి
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండల సమీపంలో ఉన్న మూలగిరిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఉదిరిపికొండ తండాకు చెందిన వాణి అనే కార్మికురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.