తాడిపత్రి: గుడిపాడు లో విషాదం, బోయ శ్రీనివాసులు (35) అనే వ్యక్తి ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య, పోలీసులు దర్యాప్తు
యాడికి మండలం గుడిపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు (35) ఇంటిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కడుపునొప్పి తాళలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య మల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై యాడికి సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు.