గుంతకల్లు: గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో నాటు సారా విక్రేత అరెస్ట్, ఏడు లీటర్ల సారా స్వాధీనం, కేసు నమోదు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో నాటు సారా విక్రయిస్తున్న లాలెప్ప అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లాలెప్ప గత కొన్ని రోజులుగా గ్రామంలో నాటుసారా విక్రయిస్తున్నాడని సమాచారం అందింది. దీంతో అతడిపై పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో తన ఇంట్లో నాటుసారా విక్రయిస్తున్నాడని తెలుసుకున్న సీఐ రామారావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇంట్లో పది కవర్లలో నిల్వ ఉంచిన ఏడు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని లాలెప్పను అరెస్ట్ చేశారు.