తాడిపత్రి పట్టణంలోని పెద్ద బజార్ లో నివాసముండే యూనియన్ బ్యాంక్ మేనేజర్ గుగారా (41) బుధవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడు. కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు మాత్రమేనా ఇంకా ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.