కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు నిరుపేదలకు వారి జీవనోపాధికై ఆదివారం 43 తోపుడుబండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాటిని పొందిన పేదలైన అలబ్ధిదారులు పట్టణంలో తోపుడుబండ్లతో ర్యాలీ నిర్వహించారు. తమకు జీవనోపాధి కల్పించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డికి, స్థానిక టిడిపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.