మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో GDనెల్లూరు జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ ముందు బుధవారం నిరసన తెలిపారు. ప్రభుత్వం మామిడి రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుందని.. గుజ్జు పరిశ్రమలు కూడా 20వ తేదీ లోపు రైతులకు 8 రూపాయలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుండా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ నెలలోపే నగదు జమ చేస్తామని ఆ కంపెనీ మేనేజర్ దిలీప్ గుజరాతి హామీ ఇచ్చారు.