ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే.. చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రారంభించడం మా అదృష్టం : ఎమ్మెల్యే గురజాల చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి నూతన కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే గురజాల విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం చాలా అదృష్టవంతుడని, మొట్టమొదటి డీడీఓ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ప్రారంభించి కూటమి ప్రభుత్వానికి గౌరవాన్ని నిలిపారన్నారు. దీంతో ప్రజలతో పాటు సచివాలయ సిబ్బందికి మేలు జరిగిందన్నారు.