నమ్మి మోసపోయాను భర్తతో ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత యువతి
నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేసిన తన భర్తతో ప్రాణహాని ఉందని తనను కాపాడాలని మంగళవారం సాయంత్రం యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కె.వి పల్లి మండలంలో చోటు చేసుకుంది. బాధిత యువతి పిర్యాదు మేరకు కె.వి పల్లి మండలం మారెళ్ళ గ్రామం నల్ల కమ్మి రెడ్డి గారి పల్లికి చెందిన ఉప్పుతోళ్ల బలరాం, శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రావణి(24 ), అదే గ్రామానికి చెందిన జయ చంద్రారెడ్డి కుమారుడు నందకుమార్ రెడ్డిని కుటుంబ సభ్యులకు తెలియకుండా అతను చెప్పిన మాయమాటలు నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపింది. అనంతరం వారం రోజుల తర్వాత అతనికి రెండు పెళ్లిళ్లు జరిగినట్టు వారిద్దరికి మోసం చేసినట్లు కూడా తె