చంద్రగ్రహణం కారణంగా మార్చి మూడో తేదీ శ్రీశైలం దేవస్థానం ఆలయ ద్వారాలు మూసివేత
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో వచ్చే నెల మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఆలయ ద్వారాలను మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. చంద్రగ్రహణం ప్రభావంతో మార్చి 3వ తేదీన ఆలయ ద్వారాలను ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ క్రమంలో భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది గ్రహణం కారణంగా ఆ రోజున నిర్వహించాల్సిన అన్ని ఆర్జిత సేవలు,పరోక్ష సేవలు, మరియు శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవ టికెట్లను పూర్తిగా రద్దు చేశారు.