దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గంలో దంచికొట్టిన అకాల వర్షం, తడిసి ముద్దైన వరి ధాన్యం
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో శనివారం మధ్యాహ్నం అకాల వర్షం దంచికొట్టింది. నియోజకవర్గంలోని తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి మండలాల్లో సుమారు గంటసేపు కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు అకాల వర్షాల వలన తీవ్ర నష్టం వాటిల్లింది. రోగాలు పడిన పంటసేల్లను వేల రూపాయలు ఖర్చు చేసి మందులు పిచికారి చేసి పండించిన పంట ఒక్కసారిగా నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.