ఇబ్రహీంపట్నం: బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కేసిఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు : మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
షాద్‌నగర్‌లోని బిఆర్ఎస్ కార్యాలయంలో చౌదరి గూడెం మండలం రావిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో మంగళవారం మధ్యాహ్నం చేరారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేసిన పనులు పథకాలు చాలా బాగున్నాయని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే తప్ప ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఒకటి కూడా నెరవేర్చలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కెసిఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.