దుబ్బాక: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో CISF బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
ఎలాంటి గొడవలు లేకుండా శాంతి యుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దుబ్బాక సిఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం 30 మంది CISF సిబ్బందితో అక్బర్పేట్ - భూంపల్లి మండల కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎటువంటి ధర్నాలు, మీటింగులు, రాస్తారోకోలు చేయకూడదు అని హెచ్చరించారు. సమావేశాలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూంపల్లి ఎస్సై రవి కాంతారావు, CISF సిబ్బంది పాల్గొన్నారు.