రెవెన్యూ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు.
తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి
అన్నమయ్య జిల్లా మదనపల్లె తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాసిల్దార్ కిషోర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. బహుజన యువసేన అధ్యక్షుడు.పునీత్ ఆర్టిఐ సమాచారాన్ని తెలుసుకోవడానికి తన అనుమతి లేకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం జరిగిందని తహసిల్దార్ తెలిపారు. ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పునీత్ ను వారించబోయిన తనపై దూరసుగా ప్రవర్తించి అసత్య ప్రసారాలు షేర్ చేస్తున్న పునీత్ పై చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తాసిల్దార్ తెలిపారు.