పామూరు మండలం వగ్గంపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఇంకా నగదు జమకాకుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. రైతు సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే వివరించారు. వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్, కూటమి నాయకులు పాల్గొన్నారు.