రాజమండ్రి లోని స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద శనివారం తర్వాత త్రాచుపాము హల్చల్ చేసింది. స్థానికులు పామును చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే పాము ఎవరికి హాని చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువు నుంచి విశసర్పాలు కొట్టుకు వస్తున్నాయని, గోదావరి పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.