సంగారెడ్డి: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : సిఐటియు సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో మున్సిపల్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఆఫీసర్లు కార్మికుల పై వేధింపులు ఆపాలని సూచించారు. ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.