అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కేశాపురం సమీపంలో మంగళవారం రాత్రి దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఆగి ఉన్న టమోటా లారీని ఐషర్ వాహనం ఢీకొనడంతో భూపాల్ (24) అనే లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిన్నమండెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు చిత్తూరు వాసిగా గుర్తించారు.