శ్రీ సత్య జిల్లా చెన్నైకొత్తపల్లిలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటిలో ఫ్యాన్ వేస్తుండగా ఆదినారాయణ అనే వ్యక్తికి విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదినారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.