నంబులపూలకుంట మండలానికి చేరుకున్న హంద్రీనీవా కృష్ణా జలాలు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండల పరిధిలోని గోపాలపురం సమీపాన ఉన్న వెలిచెలమల గ్రామపంచాయతీలో హంద్రీనీవా కాలవ ద్వారా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారం కృష్ణా జలాలు తమ ప్రాంతంలో ప్రవహించడం శుభపరిణామమని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో కృష్ణా జలాలు తమ మండలంలో ప్రవహిస్తే సాగునీటి కొరత తీరుతుందని ఆ ప్రాంత రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు