కుప్పం: భూపతికి కన్నీటి వీడ్కోలు
రామకుప్పం మండలంలోని వీర్నమలకు చెందిన రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు జనం వేలాదిగా తరలివస్తున్నారు. టీడీపీ వీరాభిమాని అయిన భూపతి పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయడంతో పాటు మండలంలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. అయితే బుధవారం విద్యుత్ షాక్ కారణంగా భూపతి మృతి చెందగా వేలాదిగా జనం తరలివచ్చి ఆయనకు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు.