మంత్రాలయం: తుంగభద్ర నదిపై వరద కాలువ నిర్మాణం, కుంభలూరు వద్ద నిలిచిపోయిన బ్రిడ్జి పనులను వెంటనే పునఃప్రారంభించాలి : రైతు సంఘం వినతి
కౌతాళం :మండలంలో తుంగభద్ర నదిపై వరద కాలువ నిర్మాణం, కుంభలూరు వద్ద నిలిచిపోయిన బ్రిడ్జి పనులను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతు సంఘం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు మెమొరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ వరద నీటిని సమర్థంగా వినియోగిస్తే పశ్చిమ కర్నూలు స్యశ్యామలమవుతుందని , సాగునీరు–తాగునీరు సమస్యలు పరిష్కారమవుతాయని నేతలు తెలిపారు. నది రిజర్వాయర్లు, చెరువులకు నీరు చేరే ప్రణాళికలను అమలు చేయాలని, అలాగే రెండు రాష్ట్రాలను కలిపే తుంగభద్ర బ్రిడ్జి పనులను తక్షణం పూర్తి చేయాలని రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరింది.