ఎస్.కొత్తూరు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగలింగేశ్వర స్వామి పునరుద్ధరణ పనులు వేగవంతం
పాణ్యం మండలం ఎస్.కొత్తూరులోని శ్రీవల్లి–దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న నాగలింగేశ్వర స్వామి పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దేవాదాయ శాఖ నిధులు రూ.1.25 కోట్లతో జరుగుతున్న ఈ నిర్మాణ పనులు పూర్తయ్యాక ఆలయం మరింత నూతన శోభను సంతరించుకోనుంది.