రాయదుర్గం మండలంలోని బొమ్మక్కపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు పల్లి కొట్టింది. స్థానికుల వివరాల మేరకు శనివారం ఉదయం అనంతపురం వైపు నుంచి రాయదుర్గం వైపు వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. అయితే కారు బారీ డ్యామేజ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలిసింది.