మార్కాపురం: పొదిలిలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుబ్బారావు వెల్లడి
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో ఆర్యవైశ్యులు కోటేశ్వరరావు అవినాష్ పై పోలీసులు చేసిన దాడిని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. అమ్మవారి శాల దగ్గర నుండి ఎమ్మార్వో కార్యాలయం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టి ఎమ్మార్వో సీఐలకు వినతిపత్రం ఇవ్వనన్నట్లు తెలిపారు. అనంతరం అందరూ కలిసి వెళ్లి ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.