సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో శుక్రవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యే పరిటాల సునీత తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి సమస్యను అర్జీ రూపంలో తీసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.